KTR : కాంగ్రెస్ మునిగి పోతున్న ప‌డ‌వ – కేటీఆర్

పీకే ఎందుకు చేరుతున్నాడో తెలీదు

KTR : కాంగ్రెస్ రోజు రోజుకు దిగ‌జారి పోతోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే అది మునిగి పోతున్న ప‌డ‌వ లాంటిద‌న్నారు మంత్రి కేటీఆర్. ప్ర‌శాంత్ కిషోర్ ఎందుకు కాంగ్రెస్ లో చేరాల‌ని అనుకుంటున్నారో తెలియ‌డం లేద‌న్నారు.

వ‌రుస ప‌రాజ‌యాలు ఎదుర‌వుతున్నా కాంగ్రెస్ పార్టీ దానిని గుర్తించ‌డం లేద‌న్నారు. ఎందుకు వెనుక‌బ‌డి ఉన్నామ‌నే దానిపై వారు ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఆయ‌న ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మారుతున్న కాలానికి అనుగుణంగా మార‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీని హేళ‌న చేశారు.

ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ఎందుకు చేరాల‌ని అనుకుంటున్నారంటూ ప్ర‌శ్నించారు కేటీఆర్(KTR). ఇదిలా ఉండ‌గా టీఆర్ఎస్ పార్టీ ప్ర‌శాంత్ కిషోర స్థాపించిన ఐపాక్ తో సంత‌కం చేశారు.

ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ త‌రుణంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి. ఓ వైపు కాంగ్రెస్ లో చేరేందుకు ప్ర‌శాంత్ కిషోర్ రంగం సిద్దం చేసుకున్నారు.

ఇప్ప‌టికే నాలుగు సార్లు గాంధీ ఫ్యామిలీతో స‌మావేశం అయ్యారు. ఈ త‌రుణంలో కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎవ‌రూ కాంగ్రెస్ పార్టీని సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు.

ప‌రాజయాలు వ‌స్తున్నా వాటిని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం మాత్రం చేయ‌డం లేద‌న్నారు. 2019లో బ‌ల‌మైన అమేథీని కోల్పోయింది. తాజాగా యూపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా పోయంద‌న్నారు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు పీకే టీం గులాబీ ద‌ళంతో జ‌త క‌ట్ట‌డం.

Also Read : గులాబీతో ఒప్పందం హ‌స్తంతో ప్ర‌యాణం

Leave A Reply

Your Email Id will not be published!