KTR Kaushik Reddy : ఈసారి కౌశిక్ రెడ్డికే ఛాన్స్ – కేటీఆర్
హుజూరాబాద్ ఇక నీకేనని ప్రకటన
KTR Kaushik Reddy : రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు రాబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. పాదయాత్రలు, సభలతో హోరెత్తించేందుకు రెడీ అయ్యాయి. ఈ తరుణంలో ఇప్పటి నుంచే భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున తెలంగాణలో ఎవరికి సీట్లు దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది.
సర్వేలు చేయిస్తూ దడ పుట్టిస్తున్నాయి. సీఎం కేసీఆర్ పని చేసే వాళ్లకే సీట్లు కేటాయిస్తామని మిగతా వారు తమ పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు.
దీంతో సిట్టింగ్ లలో దడ మొదలైంది. కొందరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా తేలింది. వారిని పిలుచుకుని కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.
తాజాగా అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న మంత్రి కేటీఆర్ కీలకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే హుజూరాబాద్ నియోజకవర్గంపై పాడి కౌశిక్ రెడ్డి ఫోకస్ పెట్టాలని సూచించారు(KTR Kaushik Reddy ). వచ్చేఎన్నికల్లో తనకే సీటు కేటాయించనున్నట్లు చెప్పకనే చెప్పారు. గతంలో కేబినెట్ లో కీలక మంత్రి పదవిలో ఉన్న ఈటెల రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ ఏర్పడింది.
వేల కోట్లు ఇక్కడ ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. చివరకు ఈటెల సూపర్ విక్టరీ సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి ఎలాగైనా సరే ఈటెలను ఓడించాలని కేటీఆర్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : త్వరలో పంతుళ్ల భర్తీకి పచ్చజెండా