KTR Chai : చాయ్ తాగితే ఫుల్ జోష్
టీ లేక పోతే ఉండలేను
KTR Chai : ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అంతా టీకి ఫిదా అవుతున్న వారే. రోజంతా కష్ట పడితే కాస్తంత రిలీఫ్ కావాలంటే చాయ్ ఉండాల్సిందే.
ఆ పేరు తల్చుకుంటేనే బాడీలో ఫుల్ జోష్ కలుగుతుందంటారు యువ నాయకుడు, మోస్ట్ పాపులర్ , డైనమిక్ లీడర్ గా పేరొందిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్.
ఆయన ప్రచార, ఆర్భాలకు పోరు. సింప్లిసిటీని ఎక్కువగా ఇష్ట పడతారు. ఇటీవల అమెరికాకు వెళ్లారు. అక్కడ రోడ్డు మీద నిల్చుని స్నాక్స్ తీసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక కేటీఆర్ ఇటు మంత్రిగా మరో వైపు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. పార్టీ శ్రేణుల్ని ఎప్పటికప్పుడు ఉత్సాహ పరుస్తూ వారికి దిశా నిర్దేశం చేస్తూ ఉంటారు.
దీంతో రోజంతా పనుల్లో నిమగ్నం కావడం వల్ల ఎక్కువ వత్తిడికి లోనవుతున్నారు. దీని నుంచి ఉపశమనం పొందేందుకు కేటీఆర్ చాయ్(KTR Chai) ని ఎక్కువగా సేవిస్తారు. అవసరమైన సమయంలో దొరికితే పర్వాలేదు.
లేక పోతే ఆయన తానే స్వయంగా టీ కొట్టు దుకాణం వద్దకు వెళతారు. అక్కడ తానే డబ్బులు ఇచ్చి టీ తాగేసి వస్తారు. రోజంతా ఎంతో బిజీగా ఉంటాం. కాస్తంత రిలీఫ్ కావాలంటే కంపల్సరీగా చాయ్ ఉండాల్సిందేనంటారు మినిష్టర్ కేటీఆర్.
అందరికీ జోష్ నింపే చాయ్ అంటే ఆయనకు చచ్చేంత ఇష్టం కూడా. ఏది ఏమైనా ఇవాళ టీ రోజు కదూ. కేటీఆర్ టీ దినోత్సవం సందర్భంగా చాయ్ ప్రియులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : రాహుల్ గాంధీ టీ ప్రియుడు