KTR Jagan Davos : దావోస్ లో జగన్..కేటీఆర్ ముచ్చట
ఏపీ సీఎంను సోదరుడంటూ ట్వీట్
KTR Jagan Davos : ఇద్దరూ యువ నాయకులే. ఒకరు తెలంగాణకు కాబోయే సీఎంగా ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించాయి. ఇంకొకరు తండ్రికి తగ్గ తనయుడు. ఏపీ చరిత్రలో అత్యధిక సీట్లు సాధించి,
అతి తక్కువ కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అరుదైన నాయకుడు సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఇక సోషల్ మీడియాలో నిత్యం బిజీగా ఉంటారు వీరిద్దరూ.
ప్రతి అంశాన్ని ప్రస్తావించడం, ప్రజలను చైతన్య పర్చడం విధుల్లో భాగం. వీరిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించిన వారే. ఒకరు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తుండగా ఇంకొకరు ఐటీ, పురపాలిక శాఖ మంత్రిగా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
ఐటీ పరంగా హైదరాబాద్ ను ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకు వచ్చేలా చేశారు కేటీఆర్. గతంలో పలుసార్లు కలుసుకున్నప్పటికీ ఈసారి సీఎం జగన్, మంత్రి కేటీఆర్(KTR Jagan Davos) ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఈ సన్నివేశానికి వేదికైంది స్విట్లర్లాండ్ లోని దావోస్. వీరిద్దరూ తమ తమ రాష్ట్రాల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని పెట్టుబడులు ఆకర్షించే పనిలో పడ్డారు.
ఈ సందర్భంగా వేర్వేరుగా హాజరైనా ఇద్దరూ ఒకేచోట కలుసు కోవడం(KTR Jagan Davos) రాజకీయ వర్గాలను విస్తు పోయేలా చేసింది. తామిద్దరం స్నేహితులమని, కానీ అంతకంటే ఏపీ సీఎం జగన్ రెడ్డి తనకు సోదరుడంటూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడు జగన్, కేటీఆర్ ల ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : లైఫ్ సైన్సెస్ లో సంస్కరణలు అవసరం