KTR Modi : మోదీ ప‌ర్య‌ట‌న బ‌హిష్క‌ర‌ణ – కేటీఆర్

తెలంగాణ‌కు పీఎం మొండి చేయి

KTR Modi : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జూలై 8న శ‌నివారం వ‌రంగ‌ల్ లో భారీ ఎత్తున ప్ర‌దాని మోదీ స‌భ‌ను బీజేపీ చేప‌ట్టింది. ఈ స‌భ‌కు రావాల్సిందిగా సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ను ఆహ్వానించింది. అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నందున ప్రోటోకాల్ ప్ర‌కారం సీఎంను ఆహ్వానిస్తున్న‌ట్లు బీజేపీ స్ప‌ష్టం చేసింది. దీనిపై శుక్ర‌వారం కేటీఆర్ సీరియ‌స్ గా స్పందించారు.

ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలంగాణ టూర్ ను తాము బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేదన్నారు. తెలంగాణ పుట్టుక‌ను, త‌మ ప్ర‌భుత్వాన్ని నిత్యం ఇబ్బందుల‌కు గురి చేస్తున్న మోదీకి తాము ఎదురు వెళ్లి ఎలా ఆహ్వానిస్తామ‌ని పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోదీపై నిప్పులు చెరిగారు కేటీఆర్(KTR).

త‌న స్వంత రాష్ట్రం గుజ‌రాత్ కు రూ. 20 వేల కోట్ల‌తో కోచ్ ఫ్యాక్ట‌రీ కోసం ఇచ్చార‌ని , కానీ తెలంగాణ‌కు కేవ‌లం రూ. 521 కోట్లు మాత్ర‌మే ఇచ్చి వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శిస్తారంటూ ఆరోపించారు . తెలంగాణ ప‌ట్ల పూర్తిగా క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు కేటీఆర్. నిన్న‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీల‌లో ఒక్క‌టి కూడా నెర‌వేర్చిన పాపాన పోలేద‌న్నారు. గిరిజ‌న విశ్వ విద్యాల‌యం, బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు మోదీని.

Also Read : Falakunama Express Fire : ప్ర‌యాణీకులు సుర‌క్షితం బోగీలు దగ్ధం

Leave A Reply

Your Email Id will not be published!