KTR : రూ. 200 కోట్ల‌తో బీవీఎస్ పెట్టుబ‌డి

అభినందించిన మంత్రి కేటీఆర్

KTR  : తెలంగాణలో మ‌రో సంస్థ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు వ్యాపార‌వేత్త‌ల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారింది.

ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌ధాన కంపెనీలు గ‌తంలో ఇండియాలోని సిలీకాన్ వ్యాలీగా పేరొందిన బెంగ‌ళూరు వైపు చూసేవి. కానీ సీన్ మారింది.

ఎప్పుడైతే కేసీఆర్ సార‌థ్యంలోన టీఆర్ఎస్ స‌ర్కార్(KTR) కొలువుతీరిందో ఆనాటి నుంచి పేరొందిన సంస్థ‌లు, కంపెనీల‌న్నీ హైద‌రాబాద్ వైపు చూస్తున్నాయి. చాలా కంపెనీలు క్యూ క‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ వ‌ర‌ల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌ధానంగా ఐటీ, ఫార్మా, అగ్రి హ‌బ్ గా మారింది ఈ న‌గ‌రం. అంతే కాదు రియ‌ల్ ఎస్టేట్ కు కేరాఫ్ గా మారి పోయింది.

ఇక్క‌డ దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక టీఆర్ఎస్ స‌ర్కార్ కొత్త‌గా తీసుకు వ‌చ్చిన టీఎస్ ఐఎస్ పాల‌సీ తీసుకు వ‌చ్చింది.

దీంతో పెట్టుబ‌డిదారుల‌కు ఈ పాల‌సీ ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతోంది. ఈ పాల‌సీ ప్ర‌ధాన ఉద్దేశం కంపెనీల ఏర్పాటుకు ప్రోత్సాహం క‌ల్పించ‌డం. గ‌తంలో ఎంతో వ్య‌య ప్ర‌యాస‌లు ప‌డేవారు .

కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఇందులో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే కేవ‌లం 15 రోజుల్లో ప‌ర్మిష‌న్ వ‌స్తుంది. ఒక వేళ రాలేదంటే అనుమ‌తి వ‌చ్చింద‌ని అనుకోవాలి. ఎవ‌రికీ న‌యా పైసా ఇవ్వాల్సిన ప‌ని లేదు.

తాజాగా మ‌రో ఫార్మా సంస్థ భార‌త్ సీర‌మ్స్ అండ్ వ్యాక్సిన్ – బీవీఎస్ సంస్థ రూ. 200 కోట్ల‌తో జీనోమ్ వ్యాలీలో పెట్టుబ‌డి(KTR) పెట్ట‌నుంది.

ఈ మేర‌కు ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ తో స‌మావేశం అయ్యారు. సంస్థ ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్ , రాష్ట్ర ఐటీ సెక్రట‌రీ జ‌యేష్ రంజ‌న్ ఉన్నారు.

Also Read : మోదీ ద‌మ్ముంటే నన్ను జైళ్లో పెట్టు

Leave A Reply

Your Email Id will not be published!