KTR : భాగ్యనగరం దేశానికి తలమానికం
స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
KTR : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. ప్రధానంగా రాజధాని నగరం భాగ్యనగరం భాండాగారంగా విలసిల్లుతోందన్నారు.
ఒకటా రెండా అన్ని రంగాలలో ఇప్పుడు హైదరాబాద్ ఐకాన్ సిటీగా మారి పోయిందన్నారు. ఒకప్పుడు సిలీకాన్ సిటీ అంటే బెంగళూరు అని చెప్పే వారని , కానీ ఇప్పుడు సీన్ మారిందన్నారు.
ఎవరిని అడిగినా, ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్ అనే సరికల్లా గౌరవంగా చూస్తున్నారని చెప్పారు. దీనికి అంతర్జాతీయ పరంగా బ్రాండింగ్ పెరిగిందన్నారు.
ప్రపంచంలోని టాప్ కంపెనీలకు చెందిన ప్రధాన కార్యాలయాలు అమెరికా తర్వాత ఎక్కువగా హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఇప్పటికే టీ హబ్, వీ హబ్, అగ్రి హబ్, ఫార్మా హబ్ పరంగా ఇండియాలో నెంబర్ వన్ గా మన సిటీ నిలిచిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని మౌలిక సదుపాయాలు, వసతులు ఇక్క మన నగరంలో మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా దేశానికి నగరం ఒక అస్సెట్ అని స్పష్టం చేశారు కేటీఆర్.
సీఎం కన్న కలలు సాకారం అవుతున్నాయని, ఒకప్పుడు తెలంగాణ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించిన వాళ్లు విస్తు పోయేలా అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.
హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్ టెక్ వెల్ కు కేటీఆర్(KTR) శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు.
Also Read : అమిత్ షాకు కేటీఆర్ బహిరంగ లేఖ