KTR IT HUBS : ఐటీ హ‌బ్ లు కొలువుల‌కు దారులు – కేటీఆర్

రెండోశ్రేణి ప‌ట్టణాల్లో ఐటీ హ‌బ్ ల ఏర్పాటు

KTR IT HUBS : ఐటీ రంగంలో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌ప్పుడు ఐటీ అంటే బెంగ‌ళూరు అనే వారు. కానీ సీన్ మారింది. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత ఐటీ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చింది. భారీ ఎత్తున ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ కంపెనీల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డంతో వేలాది మందికి ఇక్క‌డ ఉపాధి ద‌క్కుతోంది.

ప్ర‌ధానంగా రాష్ట్రానికి చెందిన యువ నాయ‌కుడు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌, పుర‌పాలిక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్(KTR) ప్ర‌త్యేక చొర‌వ వ‌ల్ల ఇది సాధ్య‌మైంది. ఇప్ప‌టికే ఐటీ శాఖ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన ఐటీ హ‌బ్ దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందింది. వంద‌ల‌కు పైగా ఐటీ కంపెనీలు కొలువు తీరాయి.

మంత్రి కేటీఆర్ ముందు చూపుతో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ కాకుండా రెండో శ్రేణి ప‌ట్ట‌ణాల్లో కూడా ఐటీ హ‌బ్ ల‌ను ఏర్పాటు చేసింది. దీని కోసం భారీ ఎత్తున ఖ‌ర్చు చేసింది. ఇప్ప‌టికే ప‌లు న‌గ‌రాల్లో ఐటీ హ‌బ్ లు ప‌ని చేస్తున్నాయి. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో ఐటీ , త‌దిత‌ర రంగాల‌లో ఉత్తీర్ణులైన వారికి ఉపాధి దొరుకుతోంది.

ఇదిలా ఉండ‌గా బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఐటీ హ‌బ్ ను గురువారం సిద్దిపేట‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.
జూలై నెల‌లో నిజామాబాద్ లో, ఆగ‌స్టులో న‌ల్ల‌గొండ‌లో ఐటీ హ‌బ్ లు మొద‌ల‌వుతాయ‌ని తెలిపారు.

Also Read : Tirumala Devotees : పోటెత్తిన భ‌క్త‌జ‌నం భారీ ఆదాయం

Leave A Reply

Your Email Id will not be published!