KTR : త్వ‌ర‌లో మున్సిప‌ల్ శాఖ‌లో పోస్టుల భ‌ర్తీ

ఉత్త‌మ న‌గ‌రాల‌లో హైద‌రాబాద్

KTR : ప్ర‌పంచంలోని ఉత్త‌మ న‌గ‌రాల‌లో హైద‌రాబాద్ త‌ప్ప‌క ఉంటుంద‌న్నారు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంపిక చేసిన 30 న‌గ‌రాల‌లో చోటు ద‌క్కేలా చేస్తాన‌ని చెప్పారు.

వ‌చ్చే సంక్రాంతి పండుగ వ‌ర‌కు 100 మురుగు నీటి వ్య‌ర్థాల‌ను శుద్ది చేస్తున్న న‌గ‌రంగా హైద‌రాబాద్ నిల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు.

న‌గ‌రానికి సంబంధించి భ‌విష్య‌త్తులో ఎలాంటి నీటి కొర‌త లేకుండా చేసేందుకు సుంకిశాల వ‌ద్ద రూ. 1,450 కోట్ల‌తో ఇన్ టేక్ వెల్ చేప‌డుతున్న‌ట్లు చెప్పారు కేటీఆర్.

మున్సిప‌ల్ శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌ని తెలిపారు. ప‌ట్ట‌ణాల‌కు ప్ర‌తి నెలా పట్ట‌ణ ప్ర‌గ‌తి కింద నిధులు విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

మున్సిప‌ల్ శాఖ వార్షిక నివేదిక‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. మ‌రికొన్ని న‌గ‌రాల‌ను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేయాల‌ని కేంద్ర స‌ర్కార్ ను విన్న‌వించారు.

అంతే కాకుండా హైద‌రాబాద్ శివారు ప్రాంతాల‌లోని 10 ప‌ట్ట‌ణాల్లో రూ. 2,410 కోట్ల‌తో 104 ర‌హ‌దారులు నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు కేటీఆర్(KTR). ఇక స్థిరాస్తి ప‌రంగా చూస్తే దేశంలోనే హైద‌రాబాద్ క్ర‌య‌, విక్ర‌యాల‌లో టాప్ లో ఉంద‌న్నారు.

గ‌త ఏడాది మ‌న రాష్ట్రానికి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డులు 12 వ‌చ్చాయ‌ని ఇది మ‌నం సాధించిన ప్ర‌గ‌తికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు మంత్రి కేటీఆర్.

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఐటీ శాఖ గ్లామ‌రస్ జాబ్ అని కానీ మున్సిప‌ల్ శాఖ ది మాత్రం థ్యాంక్ లెస్ జాబ్ అని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు , న‌గ‌ర వాసుల‌కు విశిష్ట సేవ‌లు అందిస్తున్న వారిలో పుర‌పాలిక సిబ్బంది ఉన్నార‌ని ప్ర‌శంసించారు కేటీఆర్(KTR).

Also Read : గ్యాంగ్ రేప్ పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి

 

Leave A Reply

Your Email Id will not be published!