KTR : అన్ని రంగాలలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. పది రోజుల పర్యటనలో భాగంగా కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు.
ఇవాళ ప్రవాస భారతీయులు మిలిపిటాస్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడేళ్ల కిందట తెలంగాణ ఓ పసికూన.
కానీ ఇవాళ దేశం గర్వించే స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ లో కొలువు తీరాయని, మరికొన్ని కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు.
ప్రస్తుతం దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందన్నారు కేటీఆర్(KTR). తమ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ఐఎస్ పాలసీ దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు.
ఎవరైనా స్వంతంగా పెట్టుబడులు పెట్టాలన్నా, కంపెనీలు స్థాపించాలన్నా పైరవీలు చేయాల్సిన అవసరం లేకుండా చేశామన్నారు. కేవలం 15 రోజుల్లో పర్మిషన్ వచ్చేలా చేస్తున్నామని దీంతో కంపెనీలు క్యూ కడుతున్నాయని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ ఎలా , ఏ రకంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందో చెప్పేందుకు తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. ప్రవాస తెలంగాణ వాసులు ప్రగతి పథంలో భాగస్వామ్యులు కావాలని కేటీఆర్(KTR) పిలుపునిచ్చారు.
మీరు పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలని మీలో ఉంటే రాష్ట్ర సర్కార్ ప్రవేశ పెట్టిన మన ఊరు మన బడికి దోహద పడాలని కోరారు. దత్తత తీసుకుని జయప్రదం చేయాలని సూచించారు.
అనంతరం శాన్ జోస్ లో సిఇఓ, సిటీఓ పీటర్ రాలిన్ సన్ , లూసిడ్ మోటార్స్ ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్ హాకిన్స్ తో సమావేశం అయ్యారు.
Also Read : పార్టీతో కాదు రేవంత్ తోనే పంచాయతీ