KTR : ఇన్వెస్ట‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామం తెలంగాణ

స్ప‌ష్టం చేసిన మంత్రి కేటీఆర్

KTR  : త‌మ ప్ర‌భుత్వం పెట్టుబ‌డిదారుల‌కు మేలు చేకూర్చేలా టీఎస్ఐఎస్ పాల‌సీని తీసుకు వ‌చ్చింద‌న్నారు మంత్రి కేటీఆర్(KTR ). పెట్టుబ‌డిదారుల‌కు, వ్యాపార‌వేత్త‌ల‌కు తెలంగాణ కేరాఫ్ గా మారింద‌న్నారు.

ప్ర‌పంచంలోని టాప్ కంపెనీల‌న్నీ ఇక్క‌డికే వ‌స్తున్నాయ‌ని, ప్ర‌స్తుతం టీ హ‌బ్, వీ హ‌బ్, అగ్రి హ‌బ్ , ఫార్మా హ‌బ్, రియాల్టీ హ‌బ్ గా మారింద‌న్నారు కేటీఆర్(KTR ). ప్ర‌త్యేకించి రాష్ట్రంలో పెట్టుబ‌డి పెట్టే వారికి మంచి వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.

హైద‌రాబాద్ గ‌చ్చి బౌలిలో థ‌ర్మోఫిష‌ర్స్ ఇండియా ఇంజ‌నీరింగ్ సెంట‌ర్ ను మంత్రి ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌సంగించారు. లైఫ్ సైన్స్ అత్యంత ముఖ్య‌మ‌ని ఇందులో డేటా సైన్స్ కూడా మిళితం కావ‌డం వ‌ల్ల మ‌రిన్ని ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు.

ధ‌ర్మో ఫిష‌ర్స్ ప‌రిశోధ‌న‌, అభివృద్ధి సెంట‌ర్ ను ఏర్పాటు చేస్తున్నార‌ని తెలిపారు కేటీఆర్. 15 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డితో ఈ సంస్థ ఏర్ప‌డుతోంద‌న్నారు. దీంతో నైపుణ్యం క‌లిగిన 450 మంది ఇంజనీర్లు ప‌ని చేస్తార‌ని చెప్పారు.

ఇందులో భాగంగా థ‌ర్మో ఫిష‌ర్స్ కొత్త ప్రొడ‌క్ట్స్ , విశ్లేషణాత్మ‌క ప‌రిష్కారాల‌కు కేరాఫ్ గా ప‌ని చేస్తుంద‌న్నారు. ఈ సంస్థ ప్ర‌త్యేకించి ప్ర‌తి ఏటా 1.4 బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు.

స‌ద‌రు కంపెనీ ఉత్ప‌త్తి, భూమి, నీటి వ‌న‌రుల‌పై రీసెర్చ్ చేస్తుంద‌న్నారు. ప‌రిశోధ‌న రంగంలో హైద‌రాబాద్ ఇప్ప‌టికే టాప్ లో ఉంద‌న్నారు మంత్రి.

ఇదిలా ఉండ‌గా న‌గ‌రంలో ఇప్ప‌టికే ఐడీపీఎల్ , ఇక్రిశాట్ , సీఎస్ఐఆర్ లాంటివి ఎన్నో ప‌రిశోధ‌న కేంద్రాలు ఇక్క‌డ కొలువు తీరాయ‌ని చెప్పారు. గ్లోబ‌ల్ ప‌రంగా మ‌రిన్ని సెంట‌ర్ల‌కు కేంద్రంగా హైద‌రాబాద్ మారింద‌న్నారు.

Also Read : ప‌రిమితికి మించిన స్వేచ్ఛ ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!