KTR : ఐటీలోనే కాదు అన్ని రంగాలకు సంబంధించి తెలంగాణ పెట్టుబడులకు, ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా తెలంగాణ మారిందన్నారు మంత్రి కేటీఆర్(KTR ). మంగళవారం హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కెనడా తర్వాత హైదరాబాద్ లోనే అతి పెద్ద శాఖను ఏర్పాటు చేసిందని చెప్పారు. మొదట గుజరాత్ లోని అహ్మదాబాద్ ను ఎంచుకుందని సదరు కంపెనీ.
కానీ అక్కడ వసతి సౌకర్యాలు సక్రమంగా లేక పోవడంతో వాళ్లు హైదరాబాద్ ది బెస్ట్ చాయిస్ గా ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు కేటీఆర్. తమ సిటీని ఎంపిక చేసుకున్నందుకు జాంప్ ఫార్మా కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే వారికి ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐ పాలసీని తీసుకు వచ్చామన్నారు.
ఒకప్పుడు ఐటీ అంటే సిలికాన్ వ్యాలీగా బెంగళూరు ఉండేదని కానీ ఇప్పుడు ఆ సీన్ మారిందన్నారు. అమెరికాలోని పలు కంపెనీలన్నీ హైదరాబాద్ ను ఎంచుకుంటున్నాయని వెల్లడించారు మంత్రి కేటీఆర్(KTR ).
అంతే కాకుండా అన్ని రకాలుగా ఫార్మా (మందుల) కంపెనీలకు హైదరాబాద్ అనువుగా ఉంటుందన్నారు. యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
గుజరాత్ కు చెందిన పారిశ్రామికవేత్తలు సైతం ఆ రాష్ట్రం కాకుండా తెలంగాణకు క్యూ కడుతున్నారని చెప్పారు. ఇది తాము సాధించిన ఘనతగా పేర్కొన్నారు.
28 రోజుల్లోనే జాంప్ ఫార్మాకు పర్మిషన్ ఇచ్చామని తెలిపారు. త్వరలో బీ – హబ్ ను ప్రారంభిస్తామన్నారు.
Also Read : జియో ఇనిస్టిట్యూట్ హెడ్ గా ‘గురుస్వామి’