KTR : దమ్ముంటే దా తేల్చుకుందాం
అమిత్ షాకు కేటీఆర్ సవాల్
KTR : బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. మొత్తంగా తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఓ వైపు కాంగ్రెస్ సైతం టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనంటూ ఆరోపణలు చేస్తోంది. కాదంటోంది టీఆర్ఎస్.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్(KTR) మాటల తూటాలు పేల్చడం మొదలు పెట్టారు. ఆయన ఏకంగా కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు. దమ్ముంటే దా తేల్చుకుందాం అంటూ సవాల్ విసురుతున్నారు.
ప్రస్తుతం కేటీఆర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. తుక్కుగూడ బహిరంగ సభలో అమిత్ షా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. తాజాగా షాను అబద్దాలకు కేరాఫ్ గా మారారంటూ ఆరోపించారు.
దేశాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టిన ఘనత మోదీది కాదా అంటూ నిలదీశారు. తెలంగాణది స్టార్టప్ ఫార్మూలా కేంద్రానిది ప్యాకప్ అంటూ ఎద్దేవా చేశారు. ఇద్దరు అమ్ముతుంటే మరో ఇద్దరు గుజరాతీలు కొనుక్కొంటున్నారంటూ కేటీఆర్(KTR) ధ్వజమెత్తారు.
నిజాలు చెప్పమని ప్రశ్నించాం. కానీ నిజాం గురించి మాట్లాడటం ఎందుకో అని ఎద్దేవా చేశారు. ఎక్కడా లేని రీతిలో ఇండియాలోనే సిలిండర్ ధర ఎక్కువ అని పేర్కొన్నారు కేటీఆర్.
ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు అమిత్ షాను. గాలిమోటార్లలో వచ్చి గాలి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. తమకు ముందస్తుకు వెళ్లే అవసరం లేదన్నారు.
షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ చెప్పారు.
Also Read : అమిత్ షా అబద్దాలకు బాద్ షా