KTR & Amit Shah : అబద్దాలకు కేరాఫ్ బీజీపీ – కేటీఆర్
పోరాట చరిత్ర ఆ పార్టీకి లేదు
KTR & Amit Shah : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(KTR & Amit Shah) పై నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్రం గురించి, దాని చరిత్ర గురించి ఏ మాత్రం తెలియదని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కేటీఆర్(KTR & Amit Shah) ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతే కాదు కేటీఆర్ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఎద్దేవా చేశారు.
ఆయనకు కూడా చరిత్ర తెలియదని పేర్కొన్నారు. బీజేపీకి ఎలాంటి చరిత్ర లేదన్నారు. దానికి ప్రధానంగా ప్రజాస్వామ్య పోరాట చరిత్ర అన్నది లేదని ధ్వజమెత్తారు కేటీఆర్.
భారత దేశ పోరాటం లోనూ..తెలంగాణ ఏర్పాటు లోనూ బీజేపీ ఎలాంటి పాత్ర పోషించ లేదన్నారు. అబద్దాలకు, అవాస్తవాలకు బీజేపీ పెట్టింది పేరన్నారు.
దానికి ఉన్నది ఏకైక యూనివర్శిటీ అదే అవాస్తవాలకు కేరాఫ్ గా మారిన వాట్సాప్ యూనివర్శిటీ అని ఆరోపించారు కేటీఆర్. బీజేపీ, దాని అనుబంధ సంఘాలకు ఆరోపణలు చేయడం తప్ప అవగాహన కలిగి ఉండడం , వాస్తవాలను తెలుసు కోవడం చేయరని మండిపడ్డారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి. బీజేపీ ఏకైక బలం ఝూత్ , ఝుమ్లా డబుల్ ఇంజన్ అని మండిపడ్డారు కేటీఆర్.
భారత హోం శాఖ మంత్రి అమిత్ షాకి గానీ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ చరిత్రపై అవగాహన లేదన్నారు.
అల్లూరి సీతారామరాజుకు తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆయన ఏపీకి చెందిన వారని అమిత్ షా గుర్తిస్తే మంచిదన్నారు.
Also Read : బహుజన రాజ్యం వస్తేనే విముక్తి