KTR : కట్టుకథలకు, పిట్ట కబుర్లకు పెట్టింది పేరు బీజేపీ. వాళ్లు చేసింది ఏమీ లేదు. కుల, మతాల పేరుతో విద్వేషాలు రెచ్చ గొట్టడం ఓట్లు కొల్లగొట్టడం గిదే వారి ఎజెండా. ప్రజల కష్టాలు, ఇబ్బందులు వాళ్లకు పట్టవు.
బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదది ప్రజా వంచన యాత్ర అని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. పాలమూరులో కరవు నెలకొన్న నాడు ఒక్కడు కూడా మాట్లాడలేదన్నారు.
ఇవాళ ఎక్కడ చూసినా పచ్చదనంతో అలరారుతోందన్నారు. తమను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు మంత్రి. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ (KTR ) డిమాండ్ చేశారు.
పాలమూరు గడ్డకు బీజేపీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. ప్రాజెక్టుల మంజూరులో నిర్లక్ష్యం జనానికి తెలుసన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న బీజేపీకి పోయే కాలం దగ్గర పడిందన్నారు.
పచ్చని పంటల విలసిల్లుతున్న పాలమూరును మరోసారి ఆగమాగం చేసేందుకు యాత్ర చేపట్టారా అని బండిని , బీజేపీని ప్రశ్నించారు. ముందు కృష్ణా జలాల వాటా ఏంటో తేల్చకుండా పాదయాత్ర చేపడితే ఎలా అని కేటీఆర్(KTR ) నిలదీశారు.
కర్ణాటకలోని అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా కేంద్రం కల్పించిందని కానీ పాలమూరు ప్రాజెక్టుకు ఇవ్వకుండా అడ్డుకుందంటూ నిప్పులు చెరిగారు మంత్రి.
గద్వాల, మాచర్ల రైల్వే లైన్ ను ఎలా పూర్తి చేస్తారో ముందు ఉమ్మడి జిల్లా వాసులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎన్ని దేవాలయాలకు నిధులు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు కేటీఆర్.
Also Read : మహోన్నత మానవుడు అంబేద్కర్