KTR : దాడులకు భయపడం ఎదుర్కొంటాం
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
KTR CBI Raids : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి కేంద్రాన్ని, దాని ఆధీనంలోని దర్యాప్తు సంస్థలపై మండిపడ్డారు. మతం పేరుతో మంటలు రాజేసి కులం పేరుతో కుంపట్లకు ఎగదోస్తున్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. దేశంలో మోదీకి, కాషాయ పార్టీకి ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక్కేటనని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో దాడులకు దిగితే తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు కేటీఆర్(KTR CBI Raids) .
తాము తల వంచమని అవసరమైతే తలను తీస్తామని హెచ్చరించారు. ఇవాళ దేశంలో మాయ మాటలతో పాలన సాగిస్తున్న ప్రధాన మంత్రి మోదీకి బీజేపీయేత రాష్ట్రాలను, వ్యక్తులను, సంస్థలను టార్గెట్ చేయడం అలవాటుగా మారిందన్నారు మంత్రి. ఇష్టానుసారం ధరలు పెంచుతున్నందుకు మోదీని దేవుడని పిలవాలా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. 2014లో ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానన్న పీఎం హామీ ఏమైందంటూ ప్రశ్నించారు.
బీజేపీని విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు పట్టిన శని అని సంచలన కామెంట్స్ చేశారు కేటీఆర్. విద్వేషాలతో రాజకీయం చేస్తున్న చరిత్ర ఆ పార్టీదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లుగా పాలన సాగించిందని , రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. రైతు బంధు పథకాన్ని, రూ. 2 వేల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు కేటీఆర్(KTR). ఇదిలా ఉండగా లిక్కర్ స్కాం కేసులో తన సోదరిని అరెస్ట్ చేస్తారని కొందరు చేస్తున్న కామెంట్స్ పై భగ్గుమన్నారు.
Also Read : మేఘాలయలో టీఎంసీ కింగ్ మేకర్