KTR : మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చే పని పక్కన పెట్టండి. మోదీజీ ముందు రూపాయి పతనం కాకుండా చూసుకోమంటూ సూచించారు.
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీలంకలో చోటు చేసుకున్న సంక్షోభం చూసైనా మీరు మారాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కొలువు తీరి ఎనిమిది ఏళ్లవుతున్నా ఈరోజు దాకా ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకుండా పోయిందన్నారు.
ఎన్నో వనరులున్నా వాడుకోలేని దుస్థితికి చేరుకుందన్నారు. సామాజిక మాధ్యమాలలో డిస్ ప్లే పిక్చర్ (డీపీ) మారిస్తే జీవితాలు బాగు పడవని గుర్తు పెట్టుకోవాలన్నారు. మారాల్సింది ముందు మీరు అని పేర్కొన్నారు కేటీఆర్(KTR).
రోజు రోజుకు 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ లేని రీతిలో ఇవాళ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతోందని దీనిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రధాన మంత్రిపై ఉందన్నారు.
కోట్లాది మంది ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన మోదీ కార్పొరేట్ సంస్థలకు రూ. 12 లక్షల కోట్ల రుణ మాఫీ చేశారని ఇది ఒక రకంగా దేశాన్ని మోసం చేసినట్లేనని మండిపడ్డారు కేటీఆర్(KTR).
అధికారికంగా వస్తే ఎవరికైనా ప్రోటోకాల్ పాటిస్తామని కానీ అనధికార కార్యక్రమాలకు ఎవరు వచ్చినా పాటించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించడంతో రైతులు, పేదలు, ఇతర వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యువత రాజకీయాల్లోకి రావాలని వారికి సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : సీఎం కేసీఆర్ ఆరోపణలు అబద్దం