KTR Modi : మోదీ పాలనలో దిగజారిన భారత్ ర్యాంకు
ఆకలి సూచీపై కేటీఆర్ కీలక కామెంట్స్
KTR Modi : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై. ఆయన ప్రతి రోజూ మోదీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా భారత్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ గ్లోబల్ హంగర్ ఇండెక్స్(Global Hunger Index) విడుదలైంది. ఇందులో పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్ కంటే భారత దేశం అట్టడుగున ఉందని నివేదిక తేల్చింది. ఆకలి, పౌష్టికాహారం అందించడంలో భారత్ మిగతా దేశాల కంటే దారుణమైన స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఒక రకంగా ఈ నివేదిక హెచ్చరించింది కూడా. గత ఏడాది 2021లో ప్రకటించిన ఆకలి సూచీలో భారత్ 101 ర్యాంకులో ఉండగా ఈసారి 2022లో ప్రకటించిన నివేదికలో మరో ఆరు స్థానాలు దిగజారింది. ఏకంగా 107వ స్థానంతో సరి పెట్టుకుంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సూచీకి సంబంధించి 116 దేశాలలో సర్వే చేపట్టగా ఈసారి 121 దేశాలలో సర్వే చేపట్టింది.
చివరకు బాకాలు ఊదుతూ మన్ కీ బాత్ అంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రధాన మంత్రి మోదీ(PM Modi) ఈ విషయంలో ఏమంటారో చెప్పాలని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఎన్పీఏ ప్రభుత్వం సాధించిన మరో అద్భుతమైన విజయం ఇది అంటూ ఎద్దేవా చేశారు.
ఇంకెంత కాలం ప్రజలను మాయ మాటలతో మభ్య పెడతారని ప్రశ్నించారు కేటీఆర్. కనీసం పొరుగున ఉన్న దేశాలను చూసి నేర్చుకుంటే మేలని పేర్కొన్నారు.
Also Read : హంగర్ ఇండెక్స్ లో దిగజారిన భారత్