KTR Slams : గాంధీ భవన్ లో గాడ్సేలు – కేటీఆర్
సంచలన కామెంట్స్ చేసిన మంత్రి
KTR Slams : తెలంగాణ ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. గాంధీ భవన్ లో గాంధీలు లేరు గాడ్సేలు ఉన్నారంటూ ఆరోపించారు. శుక్రవారం ప్రగతి భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లడారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయనకు సభ్యత, సంస్కారం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీకి మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నాడంటూ కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డిది ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉందని అందుకే ఆయన కేంద్రంపై, మోదీపై, అమిత్ షా పై ఒక్క పల్లెత్తు మాట్లాడటం లేదన్నారు. ఆయన పగటి కలలు కంటున్నారని, కానీ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు కేటీఆర్(KTR). ఇదే సమయంలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కూడా విరుచుకు పడ్డారు మంత్రి. ఆయనకు ఏం అర్హత ఉందని, ఏ హోదాలో తమ పార్టీపై, సీఎం కేసీఆర్ పై మాట్లాడతారంటూ ప్రశ్నించారు.
ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారంటూ స్పష్టం చేశారు కేటీఆర్. 119 సీట్లలో 100 సీట్లు గెలుచుకుంటామని జోష్యం చెప్పారు. వాళ్ల ఆశలు అడియాశలు కావడం ఖాయమన్నారు కేటీఆర్.
Also Read : KTR Allegro MS : హైదరాబాద్ లో అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్