KTR Tribute Gaddar : గద్దర్ జనం గొంతుక యుద్ద నౌక
నివాళులు అర్పించిన కేటీఆర్
KTR Tribute Gaddar : ప్రజా యుద్ద నౌక గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరని నష్టం. ఇది పూడ్చ లేనిది. ఇలాంటి అద్భుతమైన గాయకుడు రాబోయే కాలంలో పుడతాని తాను అనుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన ఆట, పాటలతో ఊపిరి పోసిన గద్దర్ ఇవాళ లేక పోవడం తనను బాధకు గురి చేసిందన్నారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR).
KTR Tribute Gaddar Said
లాల్ బహదూర్ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించారు . పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబీకులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. గద్దర్ తనయుడిని పలకరించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గద్దర్ జనం గొంతుక ప్రజా యుద్ద నౌక అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గద్దర్ పూర్తి పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన తూఫ్రాన్ లో 1949లో పుట్టారు. చిన్నప్పటి నుంచి కష్టాల కడలిని దాటుకుని వచ్చారు. బ్యాంకులో జాబ్ చేస్తూనే తన పదవికి రాజీనామా చేశారు. ప్రజల కోసం గొంతు విప్పారు. నక్సల్ ఉద్యమానికి ఊపిరి పోశాడు. తెలంగాణ ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచాడు గద్దర్.
Also Read : Gaddar Johar : జనం గొంతుకకు జోహార్