KTR Focus : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడంలో కీలకంగా మారారు. దిగ్గజ కంపెనీలు, యజమానులు, సిఇఓలు, చైర్మన్లు, సాంకేతిక, వ్యాపార, వాణిజ్య నిపుణులను కలుసుకున్నారు. అంతే కాకుండా యుఎస్ కాన్సులేట్ సమావేశంలో ప్రసంగించారు కేటీఆర్(KTR). ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
హోస్టన్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గతంలో రాష్ట్రం ఏర్పడక ముందు కేటీఆర్ , చెల్లెలు కవిత అమెరికాలో ఉన్నారు. కేటీఆర్ కు ప్రత్యేకించి న్యూయార్క్ నగరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక కేటీఆర్ యుఎస్ టూర్ లో కీలకమైన కంపెనీలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ కంపెనీల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు రానున్నాయి.
దీంతో అంతర్జాతీయ సంస్థలన్నీ హైదరాబాద్ బాట పట్టాయి. ఇక్కడ రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీ దేశానికే ఆదర్శంగా మారింది. దాదాపు కంపెనీల పరంగా చూస్తే 32 వేల మందికి పైగా జాబ్స్ రానుందని అంచనా.
హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న కంపెనీల పరంగా చూస్తే అలియంట్ గ్రూప్ ద్వారా 9 వేల జాబ్స్ , వీఎక్స్ఐ గ్లోబల్ సెంటర్ లో 10 వేలు, మాండీ హోల్డింగ్స్ లో 2 వేలు , వార్నర్ బ్రదర్స్, మెడ్ ట్రానిక్స్ , టెక్నిప్ ఎఫ్ఎంసీ లో 2,500 , జాప్ కామ్ లో 500 , జెన్ సిస్ లో 300 , ఎక్లాట్ లో 100 మందికి జాబ్స్ దక్కనున్నాయి. మొత్తంగా కేటీఆర్ సక్సెస్ ఫుల్ మంత్రిగా పేరు పొందారు.
Also Read : Nitish Kumar
