KTR : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర అవతరణ సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారని...

KTR : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలందరికీ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌లోని శ్రేణులు, ప్రజలు పండుగ వాతావరణంలో వార్షికోత్సవాన్ని జరుపుకోవాలన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర అవతరణ సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారని, అయితే ఇక్కడ 10వ వార్షికోత్సవ వేడుకలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయన్నారు.

KTR Comment

సీఎం రేవంత్ రెడ్డికి పరిపక్వత, అవగాహన లేదని, తెలంగాణ ఆవిర్భావం వెనుక చరిత్ర, త్యాగాల గురించి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాక్పాట్ సీఎం అని అన్నారు. ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి పంపిన సందేశంలో కనీసం జై తెలంగాణ అని రాలేదని, అలాంటి వ్యక్తికి కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

Also Read : Hardik Pandya : నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను

Leave A Reply

Your Email Id will not be published!