KTR : ఖాకీల ఓవ‌రాక్ష‌న్ కేటీఆర్ ఫైర్

KTR : దేశ రాజ‌ధానిలో శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన మ‌హిళా రెజ్ల‌ర్లపై ఢిల్లీ పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరు ప‌ట్ల స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శివ‌సేన పార్టీ ఎంపీలు సంజ‌య్ రౌత్ , ప్రియాంక చ‌తుర్వేది తో పాటు ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. కేంద్రాన్ని, ఢిల్లీ ఖాకీల నిర్వాకాన్ని ప్ర‌శ్నించారు. వీరితో పాటు తాజాగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన మ‌హిళల ప‌ట్ల ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేది అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. దేశం కోసం త‌మ శ‌క్తి వంచ‌న లేకుండా ఆడి ప‌త‌కాలు సాధించిన వాళ్ల ప‌ట్ల ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేదంటూ మండిప‌డ్డారు కేటీఆర్. అంత‌ర్జాతీయ ప‌రంగా ఇప్ప‌టికే బ‌జ‌రంగ్ పునియా , సాక్షి మాలిక్ , వినీత్ ఫోగ‌ట్ అద్బుత‌మైన ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్నార‌ని పేర్కొన్నారు కేటీఆర్.

కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు పూర్తిగా ప్ర‌జాస్వామానికి వ్య‌తిరేకంగా ఉన్నాయంటూ ఆరోపించారు. రెజ్ల‌ర్ల‌కు దేశ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఇప్ప‌టికే ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టిన మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు భార‌త రాష్ట్ర స‌మితి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింద‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదికగా కేంద్ర స‌ర్కార్ ను నిల‌దీశారు.

Also Read : Air India CEO

Leave A Reply

Your Email Id will not be published!