Kultar Singh Sadhwan : పంజాబ్ శాసనసభ సభాపతి (స్పీకర్ ) గా కుల్తార్ సింగ్ (Kultar Singh Sadhwan )ఎన్నికయ్యారు. ఆయనను శాసనసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తాజాగా పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో 117 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లను గెలుచుకుంది.
ఈ సందర్భంగా ఈనెల 16న భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సర్దార్ భగత్ సింగ్ పుట్టిన ఖట్కర్ కలాన్ లో జరిగిన కార్యక్రమంలో మాన్ కొలువు తీరారు. ఇటీవల కొత్త కేబినెట్ ను ప్రకటించారు.
10 మందితో మాత్రమే కేబినెట్ కొలువు తీరింది. ఇవాళ సభలో స్పీకర్ ఎన్నిక జరిగింది. కుల్తార్ సింగ్ కు 46 ఏళ్లు . భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ కు వరుసకు మనువడు అవుతారు.
ఈ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉద్వేగంతో ప్రసంగించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. స్పీకర్ స్థాయిలో ఉన్న కుల్తార్ సింగ్ కు నమస్కరిస్తున్నా. ఎన్నికైన ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
దేశానికి పంజాబ్ రాష్ట్రం రోల్ మోడల్ కావాలని అందుకు స్పీకర్ సహకారం ఉండాలని కోరారు భగవంత్ మాన్. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు అసెంబ్లీలో జరిగే సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం అవుతాయని.
ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచు కోవాలని సూచించారు. ఇదిలా ఉండగా ఆప్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం కుల్తార్ సింగ్ సాధ్వాన్ ఎన్నికను స్వాగతించారు.
Also Read : ఛత్తీస్ గఢ్ లో ఆప్ ఫోకస్