Kumar Vishwas : ఖలిస్తాన్ వేర్పాటు వాద ఉద్యమానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లోపాయికారి మద్దతు పలుకుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆప్ మాజీ రాజకీయవేత్త, కవి కుమార్ విశ్వాస్.
దీంతో ఆయనపై ఆప్ తో పాటు ఖలిస్తాన్ ఉద్యమాన్ని మద్దతుగా నిలిచే వారి నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో కుమార్ విశ్వాస్ కు కేంద్ర ప్రభుత్వం ఇవాళ వై -కేటగిరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ – సీఆర్పీఎఫ్ భద్రతను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం.
పంజాబ్ తో పాటు ఖలిస్తాన్ దేశానికి కేజ్రీవాల్ ప్రధాన మంత్రి కావాలని అనుకుంటున్నారని విశ్వాస్ ఆరోపించారు. పంజాబ్ రాష్ట్రంలో పోలింగ్ జరిగే కొన్ని గంటలకు ముందు ఆయన చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. అయితే కుమార్ విశ్వాస్(Kumar Vishwas) చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు అరవింద్ కేజ్రీవాల్.
ఇక నుంచి ఆప్ వ్యవస్థాపక సభ్యుడు విశ్వాస్ కు సీఆర్పీఎఫ్ కమాండోలు రక్షణగా ఉంటారని స్పష్టం చేసింది కేంద్రం. నలుగురు వ్యక్తిగత భద్రతా అధికారులు కుమార్ కు 24 గంటల పాటు రక్షణగా ఉంటారని వెల్లడించింది.
ఇదిలా ఉండగా కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం అవునో కాదో కేజ్రీవాల్ చెప్పాలన్నారు.
Also Read : ముదిరిన వివాదం తప్పని ఆగ్రహం