Anurag Thakur : సీఎస్ఆర్ కింద లక్ష కోట్లు ఖర్చు
ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్
Anurag Thakur : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద భారతీయ కంపెనీలు ఒక ట్రిలియన్ రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).
ఈ ఏడాది 2022 మార్చి వరకు ఈ డబ్బులు వెచ్చించినట్లు తెలిపారు. నిధులను పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, పర్యావరణం, తదితర రంగాల్లో ఖర్చు చేశారని వెల్లడించారు.
ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. వ్యవస్థాపకులు కంపెనీలను ఏర్పాటు చేస్తారని, కానీ సామాజిక పారిశ్రామికవేత్తలు దేశాన్ని నిర్మిస్తారని అన్నారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. లక్ష కోట్లకు పైగా విరాళాలు అంద జేయడం గొప్ప విషయమన్నారు.
సామాజిక బాధ్యత అనేది ప్రస్తుతం ఉన్న సామాజిక , ఆర్థిక, పర్యావరణ, ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక సమస్యలకు పరిష్కారాలను అభివృద్ది చేసే ప్రయత్నమని స్పష్టం చేశారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).
2014-15 లో భారత్ లో రూ. 15,000 కోట్ల ఖర్చుతో కార్పొరేట్ సామాజిక బాధ్యత తో ప్రపంచంలోనే ప్రథమ దేశంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఇక మార్చి 2022లో భారతీయ కంపెనీలు సీఎస్ఆర్ కింద ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేయడం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అంశమన్నారు.
న్యూఢిల్లీలో సోషల్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లను ప్రదానం చేశారు మంత్రి అనురాగ్ ఠాకూర్. దేశ నిర్మాణంలో సామాజిక పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్బర్ భారత్ దార్శనికతకు ఇండస్ట్రియలిస్టులు చురుకుగా సహకరించారని కొనియాడారు.
Also Read : విద్య తోనే భారత దేశం అభివృద్ది