Lalit Modi : ఆమె లేకుండా నేనుండ లేను

సుస్మితా సేన్ పై ల‌లిత్ మోదీ

Lalit Modi : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) క్రియేట‌ర్ గా పేరొందిన ల‌లిత్ మోదీ మ‌నీ లాండ‌రింగ్ కేసులో దేశం విడిచి పారి పోయాడు. కానీ విదేశాల‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఉన్న‌ది ఒక్క‌టే జీవితం..హాయిగా ఎందుకు ఆస్వాదించ కూడ‌దోన‌ని ఈ మ‌ధ్య‌న డేటింగ్ లో కూడా ఉన్నాడు. ఆమె ఎవ‌రో కాదు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి, ఒక‌ప్ప‌టి విశ్వ సుంద‌రి సుస్మితా సేన్ తో. వీరిద్ద‌రూ ఈ మ‌ధ్య బంధం మ‌రింత గ‌ట్టి ప‌డుతున్న‌ట్లు అనిపిస్తోంది.

ఇద్ద‌రూ త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల‌లో పోస్టులు షేర్ చేసుకుంటున్నారు. ఫోటోలలో రెచ్చి పోతున్నారు. ఆపై వీడియోలు కూడా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పెళ్లి చేసుకున్నారా అన్న ప్ర‌శ్న‌ల‌కు ఇంకా స‌మాధానం ఇవ్వ‌లేదు.

కానీ తాము ఫుల్ ప్రేమ లోతుల్లోకి జారుకున్నామంటూ పేర్కొన్నాడు లలిత్ మోదీ(Lalit Modi). సుస్మితా సేన్ సాహ‌చ‌ర్యంలో ఉంటే త‌న‌కు ఎంతో హాయిగా ఉంటుంద‌న్నాడు. గ‌త జూలై నెల‌లో తామిద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని స్ప‌ష్టం చేశాడు.

దీంతో ల‌లితా మోదీ, సుస్మితా సేన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు. నిత్యం వార్త‌ల్లో ఉంటూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఆమె చాలా హాట్ గా త‌న‌కు క‌నిపిస్తోందంటూ కామెంట్ చేశాడు ల‌లిత్ మోదీ.

ఈ ఇద్ద‌రు వీకెండ్ లో ఫుల్ బిజీగా గ‌డిపారు. ప్ర‌స్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సెన్సేష‌న్ గా మారాయి. మొత్తంగా ల‌లిత్ మోదీ ఈ రూప‌కంగా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం విశేషం.

Also Read : సౌర‌వ్ గంగూలీ వ‌ర్సెస్ ఇయాన్ మోర్గాన్

Leave A Reply

Your Email Id will not be published!