Lalu Prasad Yadav : ‘చాలీసా’కు లౌడ్ స్పీకర్లు ఎందుకు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్
Lalu Prasad Yadav : మహారాష్ట్రలో చోటు చేసుకున్న లౌడ్ స్పీకర్ల వివాదంపై స్పందించారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన తీవ్రంగా మండిపడ్డారు. హనుమాన్ చాలీసా పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు(Lalu Prasad Yadav).
ఆయన దీనిని బహుత్ గలత్ అంటూ కామెంట్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు లాలూ ప్రసాద్ యాదవ్. హనుమాన్ చాలీసా పవిత్రమైనదే కావచ్చు.
కానీ దానిని చదవాలంటే మసీదుల దగ్గరకే ఎందుకు వెళ్లాలి అని ప్రశ్నించారు. ఒక వేళ పఠించాలంటే ఎన్నో ప్రాంతాలు, ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదంతా ఒక పద్దతి ప్రకారంగా సాగుతున్న నాటకంగా ఆయన కొట్టి పారేశారు. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు(Lalu Prasad Yadav).
ఏదో ఒక నెపంతో మనుషుల మధ్య పొరపొచ్చాలు సృష్టించడం అలవాటుగా కొన్ని పార్టీలకు మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌడ్ స్పీకర్ల పేరుతో ఆందోళనలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచి పద్దతి కాదన్నారు.
కొన్ని రాష్ట్రాలలో రగులుతున్న లౌడ్ స్పీకర్ల సమస్య పూర్తిగా తప్పు అని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు లాలూ ప్రసాద్ యాదవ్.
కలిసి మెలిసి ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉందన్నారు. మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు తొలగించాలని మహారాష్ట్ర మహా నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయనపై కేసు కూడా నమోదైంది. కొన్ని చోట్ల హనుమాన్ చాలీసా ను ఆలాపించడం చర్చకు దారి తీసింది. కాగా లౌడ్ స్పీకర్ల వినియోగం విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు రాజ్ థాకరే.