Lalu Prasad Yadav : రాష్ట్రీయ జనాతా దళ్ – ఆర్ఎల్డీ చీఫ్, మాజీ బీహార్ సీఎం లలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయనను హుటా హుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
లాలూ గుండె, కిడ్నీ సంబంధ సమస్యలతో బాధ పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం లాలూను ఢిల్లీకి పంపిస్తున్నట్లు తెలిపారు రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర్ ప్రసాద్ .
ఇదిలా ఉండగా దాణా కుంభకోణం కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 వరకు పొడిగించింది.
గత నెల ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ – సీబీఐ కోర్టు ఐదో దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది.
15న పశుగ్రాసం కుంభ కోనం కేసులో యాదవ్ ను దోషిగా తేల్చింది కోర్టు. జార్ఖండ్ లోని రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు డోరాండా ట్రెజరీ నుంచి రూ. 139.35 కోట్ల అక్రమ విత్ డ్రాలో లాలూ ప్రసాద్ యాదవ్ పాత్ర ఉందంటూ స్పష్టం చేసింది.
ఈ మేరకు కోర్టు దోషిగా తేల్చింది. కాగా దేశంలోనే అతి పెద్ద కుంభకోణం కేసుగా ఇది నిలిచింది. రూ. 950 కోట్ల దాణా కుంభకోణంకు సంబంధించి ఐదు కేసులలో దోషిగా తేలడం విశేషం.
1996 జనవరిలో పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ చైబాస్ అమిత్ ఖరే ఆధ్వర్యంలో జరిగిన దాడితో ఈ స్కాం వెలుగు చూసింది. 1996 మార్చిలో సీబీఐ పాట్నా హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Also Read : పంజాబ్ లో భగత్ సింగ్ వర్ధంతికి సెలవు