Ranil Wickremesinghe : శ్రీలంక మాజీ ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే సంచలన కామెంట్స్ చేశారు. తమ హయాంలో దేశ పరిస్థితి బాగానే ఉందన్నారు. ప్రస్తుతం దేశం ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగ జారి పోవడానికి ప్రధాన కారణం దేశాన్ని పాలిస్తున్న వారే కారణమని ఆరోపించారు.
ఆనాడు, ఈనాడు భారత దేశం అన్ని రకాలుగా శ్రీలంకకు సహాయం చేసిందన్నారు. ఆదివారం మాజీ ప్రధాని విక్రమసింఘే (Ranil Wickremesinghe)మాట్లాడారు.
2019లో తాను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ మిగులు మూల ధనంతో ఆరోగ్యకరమైన స్థితిలో ఉందన్నారు. గోటబయ రాజపక్సే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందన్నారు విక్రమ సింఘే. ప్రస్తుత సర్కార్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు మాజీ ప్రధాన మంత్రి. తమ హయాంలో ఎప్పుడూ జరగలేదన్నారు.
కనీస అవసరాలు కొనేందుకు ప్రజలు క్యూలో నిలబడిన దాఖలాలు లేవన్నారు రణిల్ విక్రమ సింఘే(Ranil Wickremesinghe). జనం వీధుల్లోకి రావడానికి ఎటువంటి కారణం ఉండ కూడదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందన్నారు.
దీనికి ప్రెసిడెంట్ రాజపక్సేతో పాటు ప్రధానమంత్రి మహింద రాజపక్సే కారణమంటూ నిప్పులు చెరిగారు. భయంకరమైన ఆర్థిక పరిస్థితి రాజకీయ సంక్షోభానికి దారి తీసిందన్నారు.
జరుగుతున్న తంతు దేశానికి విపత్తు. మిగులు బడ్జెట్ , చెల్లించేందుకు తగినంత డబ్బు తమ వద్ద ఉందన్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే చాలా సమయం పడుతుందన్నారు. భారత దేశం చేసిన సాయం మరిచి పోలేమన్నారు.
Also Read : పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్