Lavrov Modi : ఇబ్బందులున్నా బంధం బ‌లంగా ఉంది

మోదీకి సందేశం ఇచ్చిన లావ్ రోవ్

Lavrov  : ర‌ష్యాపై తీవ్ర ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి లావ్ రోవ్(Lavrov )భార‌త్ లో ప‌ర్యటిస్తున్నారు. ఆయ‌న ముందుగా భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ తో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ఐక్య రాజ్య స‌మితి, ప్ర‌పంచ కోర్టు, యూరోపియ‌న్ యూనియ‌న్, బ్రిట‌న్ , ఫ్రాన్స్ , అమెరికా , త‌దిత‌ర దేశాలు ర‌ష్యా దాడుల‌ను పూర్తిగా ఖండిస్తున్నాయి.

ఈ త‌రుణంలో ఆ దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి లావ్ రోవ్ (Lavrov ) భార‌త్ లో ప‌ర్య‌టించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. భార‌త్ మాత్రం తాము ఎవ‌రితో శ‌త్రుత్వం పెంచుకోమ‌ని త‌మ‌కు కావాల్సింది శాంతి మాత్ర‌మేన‌ని ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తోంది.

ప్ర‌ధానంగా భార‌త్, ర‌ష్యాల మ‌ధ్య చ‌మురు కొనుగోలు విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఉన్నత స్థాయి స‌మీక్ష జ‌రిగింది. ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూబుల్ – రూపాయిల బంధంపై ఇరు ప‌క్షాలు ఆస‌క్తిగా ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా లావ్ రోవ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశం, ర‌ష్యా సంబంధాలు క‌ష్ట‌త‌ర‌మైన‌ప్ప‌టికీ బంధం మాత్రం బ‌లంగా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

అమెరికా విధించిన ఆంక్ష‌ల్ని అధిగ‌మించేందుకు ర‌ష్యా భార‌త్ తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ప్రెసిడెంట్ వ్లాదిమీర్ పుతిన్ నుంచి ప్ర‌ధాన న‌రేంద్ర మోదీకి వ్య‌క్తిగ‌తంగా ఒక సందేశాన్ని తెలియ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు లావ్ రోవ్.

మోదీ, పుతిన్ ఒక‌రితో మ‌రొక‌రు క్ర‌మం త‌ప్ప‌కుండా ట‌చ్ లో ఉన్నార‌ని తెలిపారు.

Also Read : సీఎం ఇంటి విధ్వంసం కోర్టు ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!