Akhilesh Yadav : యూపీలో శాంతి భద్రతలు శూన్యం
నేరస్థులు చెలరేగుతున్నారు
Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. తమ పార్టీకి చెందిన నాయకుడు, గ్యాంగ్ స్టర్ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ , సోదరుడు అష్రఫ్ అహ్మద్ లు పోలీసుల సమక్షంలోనే చంపబడ్డారు. ఈ ఘటన యూపీతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారంటూ ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ తరుణంలో ఈ మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యానాథ్. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav). ఆయన సీఎంను టార్గెట్ చేశారు.
ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వాపోయారు. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా పోలీసుల సమక్షంలో చంపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్.
ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకే ఇలా కొందరు కావాలని చేస్తున్నారంటూ ఆరోపించారు మాజీ సీఎం. ఇదిలా ఉండగా రాష్ట్రానికి చెందిన మంత్రి స్వంతంత్ర దేవ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాపం, పుణ్యం ఈ జన్మలోనే లెక్కించ బడుతుందని పేర్కొన్నారు.
Also Read : భయం నా వంట్లో లేదు – సీఎం