Ritu Raj Awasthi : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక హిజాబ్ వివాదానికి సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది హైకోర్టు. హిజాబ్ ధరించడం అన్నది తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.
అంతే కాదు 200 పేజీల తీర్పు వెలువరించింది ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం. ముస్లింలు ఆరాధించే ఇస్లాం మతంలో హిజాబ్ ధరించాలని ఎక్కడా లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ కొందరు మైనార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హోళీ పండగ తర్వాత దీనిపై విచారణ జరుపుతామని భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
ఈ తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు కర్ణాటకకు చెందిన న్యాయవాది ఉమాపతి. తనకు వాట్సాప్ ద్వారా ఓ వీడియో వచ్చిందని తెలిపాడు.
ఇందులో ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థిని (Ritu Raj Awasthi)లేకుండా చేస్తామంటూ బహిరంగంగా బెదిరించారంటూ తెలిపాడు.
తక్షణమే దీనిపై విచారణ జరిపించాలని కోరారు. అవస్థికి (Ritu Raj Awasthi)రక్షణ కల్పించాలని కోరాడు. న్యాయవాది పేల్చిన బాంబుతో ఒక్కసారిగా కర్ణాటకలో కలకలం రేగింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
వీడియో, దాని కంటెంట్ చూసి షాక్ అయ్యానని , అందుకే తాను హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆశ్రయించినట్లు తెలిపారు ఉమాపతి. తనకు వాట్సాప్ ద్వారా వీడియో సందేశం వచ్చింది.
ఇది తమిళ భాషలో ఉంది. ఇందులో జార్ఖండ్ లో జడ్జిని చంపిన అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం.
Also Read : నేరస్థుల గుర్తింపు కోసం కొత్త చట్టం