Twitter Lay Off : ట్విట్ట‌ర్ లో కొన‌సాగుతున్న కొలువుల కోత

మ‌రికొంత మంది ఎంప్లాయిస్ పై వేటు

Twitter Lay Off : ట్విట్ట‌ర్ కొత్త బాస్ ఎలాన్ మ‌స్క్ వ‌చ్చాక కీల‌క మార్పుల‌కు లోన‌వుతోంది ట్విట్ట‌ర్. ఇదే స‌మ‌యంలో కొలువుల కోత కంటిన్యూగా కొన‌సాగుతూనే ఉంది. సంస్థ‌లో 7,500 మంది ఉద్యోగులు ఉన్నారు.

టాప్ పొజిష‌న్ లో ఉన్న వారంద‌ర‌నీ సాగ‌నంపాడు. కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ వ‌చ్చిన సిఇఓ, సీఎఫ్ఓ, లీగ‌ల్ హెడ్ , చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ వెళ్లి పోయారు.

ఇదే స‌మ‌యంలో 3,978 మందిపై వేటు వేశాడు ఎలాన్ మ‌స్క్. మ‌రో వైపు కాంట్రాక్టు కింద ప‌ని చేస్తున్న 5 వేల మందిని తొల‌గించాడు. ఇదే స‌మ‌యంలో మూడు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఇస్తున్నాన‌ని ఇక నుంచి తాను ఒప్పుకోనంటూ ప్ర‌క‌టించాడు.

ప‌ని తీరు బాగుంటే ఓకే లేదంటే వేటు వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ టార్చ‌ర్ తాము త‌ట్టుకోలేమంటూ ఏకంగా 1,200 మంది తాము రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో తాజాగా ఫ్రెంచ్ ట్విట్ట‌ర్ ఆప‌రేష‌న్స్ హెడ్ గా ఉన్న వీల్ తాను త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ప‌లు ఆఫీసుల‌ను మూసి వేశారు.

ట్విట్ట‌ర్ లో క‌ష్ట‌ప‌డే వారికి మాత్ర‌మే ఛాన్స్ ఉంటుంద‌ని ఆ త‌ర్వాత తొల‌గిస్తానంటూ(Twitter Lay Off) చేసిన ప్ర‌క‌ట‌న చాలా మందిని వెళ్లి పోయేలా చేసింది. ఈ త‌రుణంలో ఇప్పుడు కేవ‌లం టెక్నిక‌ల్ ఎక్స్ ప‌ర్ట్స్ మాత్ర‌మే ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ లో మిగిలి పోయారు.

ఇప్ప‌టికే కోత‌లు, రాజీనామాల కార‌ణంగా ఎలాన్ మ‌స్క్ మరో షాక్ కు గురి చేశాడు. మ‌రికొంత మందిని త‌ప్పించాడు. ట్విట్ట‌ర్ బాస్ తీసుకున్న నిర్ణ‌యం విస్తు పోయేలా చేసింది.

Also Read : ‘ఐ ల‌వ్ యూ ర‌స్నా’ను మ‌రిచి పోలేం

Leave A Reply

Your Email Id will not be published!