Manish Tiwari : కాంగ్రెస్ అగ్ర నాయకుడు మనీష్ తివారీ సంచలన కామెంట్స్ చేశారు. తాను అద్దె దారు కాదని పార్టీలో భాగస్వామినని స్పష్టం చేశారు.
కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్విని కుమార్ పార్టీని వీడిన వెంటనే తివారీ కూడా కాంగ్రెస్ ను వీడతారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
ఈ తరుణంలో మనీష్ తివారీ(Manish Tiwari) ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను బలవంతంగా వెళ్లగొడితే తప్ప పార్టీని వీడే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఎవరైనా నన్ను బయటకు నెట్టి వేయాలని అనుకుంటే తప్ప తాను వెళ్లనని పేర్కొన్నారు. అశ్వినీ కుమార్ రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు మనీష్ తివారీ.
పార్టీ ఆయనకు మంచి పదవి ఇచ్చింది. గుర్తింపు కూడా ఇచ్చింది. ఈ సమయంలో పార్టీని వీడడం, ఆపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టారు.
తాను గతంలో కూడా అద్దె దారుని కాదనని. నేను భాగస్వామిని అని తెలిపాడు. నా విషయానికి వస్తే నేను ఈ పార్టీకి తన జీవితంలో 40 ఏళ్లకు పైగా పార్టీ కోసం కష్ట పడ్డా.
దానితోనే కొనసాగుతూ వచ్చానని వెల్లడించారు. దేశ సమైక్యత కోసం తమ కుటుంబం రక్తాన్ని చిందించిదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
పదవుల కోసం ఏనాడూ పాకుడు లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో తివారీ(Manish Tiwari) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా పార్టీని వీడితే నష్టం కలుగుతుందన్నారు.
దాని గురించి పార్టీ అధినాయకత్వం ఆలోచించాలని సూచించారు. అశ్వనీ కుమార్ వెళ్లడం పార్టీ ఒక రకంగా దెబ్బే నని ఒప్పుకున్నాడు.
Also Read : మౌనం వీడిన మన్మోహన్ మోదీపై ఫైర్