Legends League Cricket : రేపటి నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్
ఇండియన్ మహరాజా స్కిప్పర్ గా సెహ్వాగ్
Legends League Cricket : ఈనెల 20 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ – ఎల్ఎల్ సీ (Legends League Cricket)టీ20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ లీగ్ ఓమన్ లో జరుగుతోంది. ఇండియన్ మహరాజా, ఆసియా లయన్స్ , వరల్డ్ జెయింట్స్ జట్లు ఆడనున్నాయి.
ఇందుకు సంబంధించి ఆయా జట్లకు కెప్టెన్లను ప్రకటించారు. ఇండియన్ మహరాజా టీమ్ కు వీరేంద్ర సెహ్వాగ్ స్కిప్పర్ గా వ్యవహరిస్తారు. మహ్మద్ కైఫ్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు. జట్టు కోచ్ గా ఆసిస్ మాజీ ప్లేయర్ బుచానన్ ఎంపికయ్యాడు.
సెహ్వాగ్ గతంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్, ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా ఐపీఎల్ లో వ్యవహరించాడు. ఆసియా లయన్స్ స్కిప్పర్ గా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ మిస్సా ఉల్ హక్ ఉన్నాడు.
ఇందులో పాకిస్తాన్, లంక, బంగ్లా, ఆఫ్గనిస్తాన్ తరపున మాజీ ఆటగాళ్లు ఆడతారు. వీరిలో అఫ్రిదీ, షోయబ్ అక్తర్ , హఫీజ్ , ఉమర్ గుల్ , సనత్ జయసూర్య, తిలకరత్నే, దిల్షాన్ , చమిందా వాస్ , బషర్ ఉన్నారు. వైస్ కెప్టెన్ గా దిల్షాన్ ఎంపికయ్యాడు.
ఇక కోచ్ గా శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగా వ్యవహరిస్తాడు. ఇక వరల్డ్ జెయింట్స్ టీమ్ కు విండీస్ మాజీ ఆల్ రౌండర్ సామీ కెప్టెన్ గా ఉంటాడు. ఈ టీమ్ లో టాప్ క్లాస్ ప్లేయర్లు ఉండడం విశేషం.
బ్రెట్ లీ, వెటోరీ, కెవిన్ పీటర్సన్ , ఇమ్రాన్ తాహిర్ ఆడతారు. సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ జాంటీ రోడ్స్ మెంటార్ గా వ్యవహరిస్తాడు. ఈనెల 20న ఇండియా మహారాజా స్ వర్సెస్ ఆసియా లయన్స్ తో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
Also Read : టీ20 వరల్డ్ కప్ 2022 వేదికలు ఇవే