KCR : సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో కేసీఆర్(KCR) మాట్లాడారు. చట్ట సభలు ఆరోగ్యకరమైన చర్చలకు వేదికలు కావాలని పిలుపునిచ్చారు.
బడ్జెట్ అంటేనే నిధుల కూర్పు అని పేర్కొన్నారు. అద్భుతం అని అధికారంలో ఉన్న ప్రభుత్వం చెబితే విపక్షాలు పసలేని బడ్జెట్ అంటూ విమర్శించడం షరా మామూలేనని అన్నారు.
పనిలో పనిగా ప్రధాని మోదీ, కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల సీరియస్ (KCR)అయ్యారు. పెట్టుబడులకు, ఆరోగ్యకరమైన వాతావరణానికి తెలంగాణ కేరాఫ్ గా మారిందని చెప్పారు.
సద్విమర్శలను తాము ఎప్పుడూ స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తన ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న సభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని తెలిపారు.
ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాలకు సంబంధించి చట్ట సభలలో ప్రధాన అంశాలు చర్చకు రావడం లేదన్నారు. అంకెలు తప్ప మరేమీ ఉండదన్న అభిప్రాయాన్ని తొలగించు కోవాలన్నారు.
మరింత చర్చలకు ఆస్కారం ఉండేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యువ నాయకత్వం కూడా దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు.
బడ్జెట్ ప్రజలకు సంబంధించిన ఆస్తి అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుందో ముందే లెక్కలతో సహా రూపొందిస్తుందన్నారు.
ఇక ఇటీవల కేంద్ర సర్కార్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను తీసుకునేందుకు వీలుగా పావులు కదుపుతున్నారంటూ ఆరోపించారు. దీనిని తాము ఒప్పుకోబోమన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్బుతంగా ముందుకు సాగుతోందని తెలిపారు కేసీఆర్.
Also Read : ఉన్నత పదవుల్లో రైతు బిడ్డలు