Amit Shah : ఓట్ల కోసమే విమోచన దినోత్సవం జరుపలేదు
నిప్పులు చెరిగిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విపక్షాలను టార్గెట్ చేశారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈ ప్రాంతాన్ని పాలించిన వారు హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించ లేక పోయారని ఆరోపించారు.
విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు అమిత్ షా.
హైదరాబాద్ విముక్తికి సర్దా వల్లభాయ్ పటేల్ కారణమని కొనియాడారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో, రజాకర్ల భయంతో ఆ దినోత్సవాన్ని జరుపుకోకుండా వెనుదిరిగిన వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde), తదితర ప్రముఖ నేతలు పాల్గొన్నారు. సర్దార్ పటేల్ లేక పోతే హైదరాబాద్ విముక్తికి ఇంకెన్నాళ్లు పట్టేదన్నారు.
నిజాం రజాకర్లను ఓడించ లేనంత కాలం అఖండ భారత్ కల నెరవేరదని ఆయనకు తెలుసన్నారు అమిత్ షా(Amit Shah). హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుపు కోవాలనే కోరిక ఈ ప్రాంతానికి చెందిన వారిలో ఉండేదన్నారు.
కానీ 75 ఏళ్ల కాలం పట్టిందన్నారు అమిత్ షా. ఎన్నికల సమయంలో ఎన్నోసార్లు వాగ్ధానం చేశారు. కానీ ఎన్నికలయ్యాక వారు దానిని మరిచి పోయారని ఎద్దేవా చేశారు.
Also Read : ‘చిరుతలు’ రావడం చారిత్రాత్మకం – మోదీ