Lt Gen Manoj Pande : కొత్త ఆర్మీ చీఫ్ గా మ‌నోజ్ పాండే

ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

Lt Gen Manoj Pande : భార‌త దేశ‌పు అత్యున్న‌త ప‌ద‌వికి మ‌నోజ్ పాండే నియ‌మితుల‌య్యారు. కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండేను(Lt Gen Manoj Pande) నియ‌మిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

జ‌మ్మూ కాశ్మీర్ లోని నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ప‌ల్ల‌న్ వాలా సెక్టార్ లో ఆప‌రేషన్ ప‌రాక్ర‌మ్ స‌మ‌యంలో లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే ఇంజ‌నీర్ రెజిమెంట్ కు నాయ‌క‌త్వం వ‌హించారు.

ఇదిలా ఉండ‌గా భార‌తీయ ఆర్మీ చ‌రిత్ర‌లో కార్ఫ్స్ ఆఫ్ ఇంజ‌నీర్స్ నుండి ఆర్మీ స్టాఫ్ చీఫ్ అయిన మొద‌టి అధికారి లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే కావ‌డం విశేషం.

ప్ర‌స్తుత ఆర్మీ త‌దుప‌రి చీఫ్ గా నియ‌మితులైన మ‌నోజ్ పాండే (Lt Gen Manoj Pande) వ‌చ్చే మే 1న ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రిస్తూ సోమ‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

కాగా కార్ప్స్ ఆఫ్ ఇంజ‌నీర్స్ నుండి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయిన మొద‌టి ఆఫీస‌ర్. ఏప్రిల్ 30న త‌న 28 నెల‌ల ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేయ‌నున్న జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వాణే స్థానంలో మ‌నోజ్ పాండే బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

అయితే లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండేని ఆర్మీ స్టాఫ్ త‌దుప‌రి చీఫ్ గా నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని డిఫెన్స్ శాఖ స్ప‌ష్టం చేసింది. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ పూర్వ విద్యార్థి కావ‌డం విశేషం.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి, లెఫ్టినెంట్ జనరల్ పాండే డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో నియమించబడ్డారు.దాదాపు 38 ఏళ్ల ఆర్మీలో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది మ‌నోజ్ పాండే కు.

Also Read : క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత‌ల‌పై కేసు

Leave A Reply

Your Email Id will not be published!