Liger Akdi Pakdi Song : నెట్టింట్లో లైగ‌ర్ సాంగ్ హ‌ల్ చ‌ల్

యూట్యూబ్ లో పాట‌కు ప్ర‌జాద‌ర‌ణ

Liger Akdi Pakdi Song : డైన‌మిక్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రౌడీ బాయ్ గా పేరొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే తో పాటు ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ క‌లిసి న‌టించిన లైగ‌ర్ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్ల‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన అక్డ్ ప‌క్డ్ సాంగ్(Liger Akdi Pakdi Song)  అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అన‌న్య పాండే, విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ పాట‌లో రెచ్చి పోయారు. ఒక‌రి కంటే మ‌రొక‌రు పోటీ ప‌డి న‌టించారు.

డ్యాన్సుతో హోరెత్తించారు. న‌టి ఇంధ‌న ట్యాంక్ పై ప‌డుకున్న‌ప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ బైక్ న‌డుపుతూ పాట ప్రారంభం అవుతుంది. ఆపై అన‌న్య పాండే విజ‌య్ పై ముద్దు పెడుతుంది.

బీట్ స్టార్ట్ అవుతుంది. స‌న్నివేశం మారుతుంది. పాట స్పీడ్ కు త‌గ్గ‌ట్టుగా ఇద్ద‌రూ డ్యాన్సుతో అల‌రించారు. ఒక ర‌కంగా చెప్పాలంటే డ్యాన్స్ ఫ్లోర్ ను శాసించారు.

అక్డ్ ప‌క్డ్ సాంగ్ ను దేవ్ నేగి, పావ్నీ పాండే , లిజో జార్జ్ పాడారు. దీనిని మొహ్సిన్ షేక్, అజీమ్ ద‌యాని రాశారు పాట‌ను. ఈ ట్రాక్ ను లిజో జియోజ్ – డీజే చేత‌స్ కంపోజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా అన‌న్య పాండే త‌న సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సాంగ్ ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ ఎలా ఉందంటూ ప్ర‌శ్నించారు. లెట్స్ గో బాయ్స్ స్టార్ట్ డ్యాన్స్ టు ది లైగ‌ర్ ..మాస్ స్టెప్ ఇయ‌ర్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మాస్ ట్రాక్ అంటూ పేర్కొన్నారు.

Also Read : సల్మాన్ ఖాన్ ను ఎప్ప‌టికీ క్ష‌మించం

Leave A Reply

Your Email Id will not be published!