Liger Song Aafat : నెట్టింట్లో లైగ‌ర్ ఆఫ‌త్ సాంగ్ వైర‌ల్

దేవ‌ర‌కొండ‌..అనన్య పాండే అదుర్స్

Liger Song Aafat : డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రౌడీ హీరోగా పేరొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే క‌లిసి న‌టిస్తున్న లైగ‌ర్ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇప్ప‌టికే మూవీ(Liger Movie) మేక‌ర్స్ విడుద‌ల చేసిన టీజ‌ర్స్ , పోస్ట‌ర్స్ , సాంగ్స్ దుమ్ము రేపాయి. మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వ‌స్తున్నాయి. ఇక లైగ‌ర్ టీం చేస్తున్న మూవీ ప్ర‌మోష‌న్స్ మామూలుగా లేవు.

ఎక్క‌డికి వెళ్లినా యూత్ నుంచి ఎక్కువ‌గా రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుద‌లైన సాంగ్(Liger Song Aafat) ఆఫ‌త్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక యూట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే న‌ట‌న ఈ పాట‌కు హైలెట్ గా నిలిచింది. ప్ర‌ధానంగా అన‌న్య పాండే త‌న అందాల‌ను ఆర‌బోసింది. స‌ముద్రం ఒడ్డున విజ‌య్ తో స‌ర‌స స‌ల్లాపాల స‌రిగ‌మల సాంగ్ యూత్ ను ఆక‌ట్టుకునేలా చేశాడు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్.

పూరీ మూవీ అంటేనే బీచ్ లు , అందాలు, ఆపై ఆర‌బోత‌లు స‌హ‌జ‌మే. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు(Vijay Deverakonda) యూత్ లో ఉన్న క్రేజ్ ప్ర‌స్తుతం లైగ‌ర్ కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఇక బాలీవుడ్ లో టాప్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడిగా పేరొందిన క‌ర‌ణ్ జోహ‌ర్ లైగ‌ర్ మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌మోష‌న్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఆఫ‌త్ పాట‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య మ‌ధ్య కెమ‌స్ట్రీ పండింది. తనిష్క్ బాగ్చి, జ‌హ్రా ఖాన్ ఈ పాట‌ను ఆలాపించారు. త‌నిష్ బాగ్చి సంగీతం స‌మ‌కూర్చారు. ర‌ష్మీ విరాట్ పాట‌ను రాశారు.

Also Read : దీపికా ప‌దుకొనే షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!