Devendra Fadnavis : దేవేంద్ర ఫడ్నవీస్ కు లైన్ క్లియర్
మరోసారి సీఎం కానున్న బీజేపీ చీఫ్
Devendra Fadnavis : భారతీయ జనతా పార్టీ అనుకున్నట్టే పంతం నెగ్గించుకుంది. గత కొంత కాలంగా మరాఠాలో కొలువు తీరిన శివసేన, కాంగ్రెస్ , ఎన్సీపీ తో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు(Devendra Fadnavis).
సర్కార్ ను కూల్చాలని అనుకున్నారు. ఆ దిశగా పావులు కదిపారు. తమను లక్ష్యంగా చేసుకున్న శివసేన పార్టీని దెబ్బ కొట్టారు. అదీ మరీ బహిరంగంగా ప్రకటించారు కూడా.
బహుషా కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉండడం కావచ్చు. బీజేపీ సీనియర్ లీడర్ నారాయణ రాణె రెండు నెలల్లో కూల్చి వేస్తామని ప్రకటించారు. అంతకంటే ముందే మహా వికాస్ అఘాడి రెండున్నర ఏళ్లలోనే కూలి పోయింది.
శివసేన పార్టీలోనే చీలిక తీసుకు వచ్చారు. బయటకు చెప్పక పోయినా తిరుగుబాటు జెండా ఎగుర వేసిన మంత్రి ఏక్ నాథ్ షిండే ను ఎగదోశారు. ఆయనకు మిగతా శివసేన ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రేకు షాక్ ఇస్తూ జంప్ అయ్యారు.
పైకి బీజేపీ మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. కానీ షిండే వర్గం కొలువు తీరింది మాత్రం బీజేపీ ఆధీనంలో ఉన్న అస్సాంలోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేశారు.
రోజుకు రూ. 8 లక్షలు ఖర్చు చేశారు. జస్ట్ రూములు, ఇతర ఖర్చులకు మాత్రమే. ఫుల్ ఎంజాయ్ కూడా చేశారని ఆరోపించారు శివసేన స్పోక్స్ పర్సన్ సంజయ్ రౌత్.
బీజేపీ పూర్తిగా మరాఠాను తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటుంది తప్పా షిండేకు చాన్స్ ఇవ్వదు. షిండేకు ప్రయారిటీ ఇస్తూనే పవర్ అంతా తన చేతిలో ఉంచుకుంటుంది.
డిప్యూటీ సీఎంతో పాటు 9 మందికి పైగా కేబినెట్ లో చోటు దక్కనుంది.
Also Read : శివసేనకు షాక్ బీజేపీ సక్సెస్