Pramod Sawant : ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. భారతీయ జనతా పార్టీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గోవా సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై కొనసాగుతూ వస్తున్న సస్పెన్స్ కు పుల్ స్టాప్ పెట్టింది.
ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ తన ఆధీనంలో ఉన్న ఉత్తరాఖండ్ , గోవా, మణిపూర్ , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వచ్చింది.
కాగా పంజాబ్ లో పవర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ ఆప్ అఖండ విజయాన్ని నమోదు చేసింది. సీఎంల ఎంపిక విషయంలో యూపీ లో యోగికి లైన్ క్లియర్ అయినప్పటికీ మిగతా గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లలో సీఎంల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది బీజేపీ.
వీరి ఎంపికపై మల్లగుల్లాలు పడింది. చివరకు గతంలో ఉన్న వారికే తిరిగి పవర్ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక మోదీ త్రయం ఉందన్నది వాస్తవమే.
మణిపూర్ లో ముగ్గురు పోటీ పడ్డారు. చివరకు ఎన్. బీరేన్ సింగ్ వైపు మొగ్గు చూపితే ఉత్తరాఖండ్ లో అనూహ్యంగా సీఎంగా ఉంటూ ఓడి పోయిన పుష్కర్ సింగ్ ధామీకే ఛాన్స్ ఇచ్చింది.
ఇక గోవాకు వచ్చే సరికి సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. కానీ మోదీ అనుచరుడిగా ముద్ర పడిన ప్రమోద్ సావంత్(Pramod Sawant) కే మరోసారి గోవా పీఠం అప్పగించింది బీజేపీ.
ఇదిలా ఉండగా బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో సావంత్ నే తమ పక్షం నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పరిశీలకుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
Also Read : సీపీఎం నుంచి రెబల్స్ కు ఆహ్వానం