Udaipur Tailor Killers : టైలర్ కిల్లర్స్ కు పాక్ తో లింకులు
బయట పడిన ఫోన్ నెంబర్లు
Udaipur Tailor Killers : రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ హత్య(Udaipur Tailor Killers) కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రవక్తపై అనుచిత కామెంట్స్ కు వ్యతిరేకంగా దర్జీని చంపినట్లు నిందితులు బహిరంగంగా వెల్లడించారు.
ఆపై మోదీపై దాడి చేస్తామని తెలిపారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టైలర్ హత్య చేసిన ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 144వ సెక్షన్ విధించింది.
ఉదయ్ పూర్ లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా అదనపు బలగాలను మోహరించారు. ఇదిలా ఉండగా తాజాగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.
జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో టైలర్ కన్హయ్య లాల్ హంతకుల్లో ఒకరికి పాకిస్తాన్ తో సంబంధాల ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
అతడి ఫోన్ లో పాకిస్తాన్ కు చెందిన 10 మంది ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసును ఉగ్రవాద కేసులను విచారించే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించనున్నారు.
నిందితుడు మహ్మద్ రియాజ్ అన్సారీ పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడైంది. వారు స్పష్టంగా ఐఎస్ఐఎస్ వీడియోలు చూశారని, వాటి ద్వారా ప్రభావితం అయ్యరంటూ అనుమానిస్తున్నారు.
ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా భయాందోళనలు వ్యాప్తి చేసేందుకే ఈ హత్య జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీఎం గెహ్లాట్ చెప్పారు. బాధిత కుటుంబానికి రూ. 31 లక్షలు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం – సీఎం