Gautam Gambhir Sisodia : నిధుల కోసమే లిక్కర్ పాలసీ
బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్
Gautam Gambhir Sisodia : భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఆప్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు , అక్రమ మార్గాల్లో డబ్బులను పొందేందుకు ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారంటూ ధ్వజమెత్తారు గౌతమ్ గంభీర్. మంగళవారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు నేతృత్వం వహించడంతో పాటు విద్యా శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిసోడియా పాఠశాలలు, కాలేజీలు తెరిచి ఉంటే బీజేపీకి చూపించాలని డిమాండ్ చేశారు.
ఓపెన్ అండ్ షట్ కేసుగా అభివర్ణించారు ఎంపీ. ఖలిస్తానీ సహాయంతో ఎన్నికల్లో పోరాడేందుకు డబ్బులను దోపిడీ చేసేందుకు గాను ప్రత్యేకంగా ఎక్సైజ్ పాలసీని రూపొందించారంటూ ఆరోపించారు. తాము నిజాయితీ పరులమని నిరూపించు కోవాలని , ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు గౌతమ్ గంభీర్. మనీష్ సిసోడియాది(Gautam Gambhir Sisodia) ఇందులో కీలకమైన పాత్ర ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే ఆప్ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు ఎంపీ.
సౌత్ గ్రూప్ సంగతి ఏంటి. సీబీఐ కావాలని ఎవరిపైనా అభియోగాలు మోపదన్నారు గౌతమ్ గంభీర్. ఇదే సమయంలో ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నాయకుడు హరీష్ ఖురానా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో ఉన్నారు. ఇక తదుపరి ప్లేస్ మనీష్ సిసోడియాదేనని అన్నారు. వెంటనే ఏ మాత్రం నిజాయితీ ఉన్నా తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : సిసోడియా అభ్యర్థన సీజేఐ విచారణ