Sharad Yadav : భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకులలో శరద్ యాదవ్ (Sharad Yadav)ఒకరు. బీహార్ కు చెందిన ఈ అపర చాణక్యుడు ఇటీవల కనిపించడం లేదు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.
తనకంటూ ఓ ప్రత్యేకమైన వర్గం, ఓటు బ్యాంకు ఉంది. కానీ ఆర్జేడీ నితీశ్ కుమార్ పాచికల ముందు వీరి ఆటలు సాగడం లేదు. మరో వైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన బీహార్ బాద్ షాగా పేరొందిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నాడు.
ఆయన ఇంటి పోరుతో సతమతం అవుతుండగా ఇక తాను స్థాపించిన పార్టీ లోక్ తాంత్రిక్ జనతాదళ్ కు ఎలాంటి ఆదరణ అగుపించడం లేదు.
దీంతో పాటు తన ఆరోగ్యం కూడా సహకరించక పోవడంతో చివరకు శరద్ యాదవ్ ఆ పార్టీని పూర్తిగా నితీశ్ నాయకత్వంలోని ఆర్జేడీలో విలీనం చేసేందుకు నిర్ణయించారు.
ఈ మేరకు పార్టీ శ్రేణులకు కూడా ఈ విషయాన్ని చేర వేశారు. ఇందుకు సంబంధించి ఈనెల 20న ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రకటించారు. అధికారికంగా కూడా వెల్లడించారు శరద్ యాదవ్.
వివిధ జనతాదళ్ గ్రూపులను కలిపే ప్రయత్నంలో భాగంగా తన పార్టీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాదాపు బీహార్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో 35 ఏళ్లకు పైగా లాలూ ప్రసాద్ యాదవ్ , శరద్ యాదవ్(Sharad Yadav) లు కలిసే ఉన్నారు.
ఇద్దరూ చరమాంకంలో ఉండడం కూడా ప్రధాన కారణంగా తోస్తోంది.
Also Read : సుప్రీంకు చేరిన హిజాబ్ వివాదం