LK Advani: ఆడ్వాణీకి మళ్లి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక !
ఆడ్వాణీకి మళ్లి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక !
LK Advani: భాజపా సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఆయనను దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
LK Advani Health Update
96 ఏళ్ల ఆడ్వాణీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. జూలై 3న అద్వానీ ఆనారోగ్యం బారిన పడటంతో అయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఒక రోజు చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దీనికంటే వారం రోజల ముందు కూడా అద్వానీ వృద్దాప్యంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి ఒకరోజు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
నవంబరు 8న అవిభక్త భారత్‌లోని కరాచీ లో జన్మించిన ఆడ్వాణీ సుదీర్ఘకాలం పాటు భాజపా లో పనిచేసి రాజకీయ కురువృద్ధుడిగా పేరుగాంచారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారత రత్న’తో సత్కరించడం సంగతి తెలిసిందే.
Also Read : Manish Sisodia: సిసోడియా పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ !