Lloyd Austin : భారత్ అమెరికా రోడ్ మ్యాప్ సిద్దం
లాయడ్ ఆస్టిన్ , రాజ్ నాథ్ సింగ్ భేటీ
Lloyd Austin : భారత్, అమెరికా రక్షణ పారిశ్రామిక సహకారం కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ ను ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా రక్షణ కార్యదర్శి లాయడ్ ఆస్టిన్(Lloyd Austin) స్పష్టం చేశారు. భారత్ టూర్ లో భాగంగా ఆయన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుసుకున్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్, యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇండో పసిఫిక్ కు మూల స్తంభం అని అభివర్ణించారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో ఉత్పాదక చర్చలు జరిపినట్లు అమెరికా రక్షణ కార్యదర్శి వెల్లడించారు. తమ భాగస్వామ్యం వేగంగా పెరుగుతూనే ఉందన్నారు. తాము రక్షణ పారిశ్రామిక సహకారాన్ని విస్తరించాలని చూస్తున్నామని ఆస్టిన్ చెప్పారు. వాషింగ్టన్ లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు ముందు అమెరికా రక్షణ మంత్రి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నారు.
క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ పై యుఎస్ , ఇండియా చొరవను అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది మేలో ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్వాంటం కంప్యూటింగ్ , 5జీ , 6జీ , బయో టెక్, స్పేస్ , సెమీ కండక్టర్స్ వంటి రంగాలలో రెండు దేశాలు కీలక భాగస్వామిగా ఉన్నాయని స్పష్టం చేశారు అమెరికా కార్యదర్శి లాయడ్ ఆస్టిన్.
Also Read : CM Nitish Kumar : బ్రిడ్జి కూలిన ఘటనలో చర్యలు తప్పవు