CM Bommai Budget : కర్ణాటక బడ్జెట్ లో రైతులకు పెద్దపీట
స్పష్టం చేసిన సీఎం బస్వరాజ్ బొమ్మై
CM Bommai Budget : రైతులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించింది కర్నాటక సర్కార్. ఈ ఏడాది చివరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం త్రిముఖ పోరు కొనసాగుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ , జేడీయూ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పించేలా సాగింది. ప్రధానంగా రాష్ట్రంలో రైతులకు ఉపయోగ పడేలా దీనిని రూపొందించారు.
ప్రత్యేకించి రైతులకు రుణ కాల పరిమితిని పెంచింది ప్రభుత్వం. అంతే కాకుండా సబ్సిడీలు కూడా వర్తింప చేసేలా నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలకు అవసరమైన ఎలాంటి ఇబ్బందులు లేని, అవసరాల ఆధారిత రుణ సదుపాయాన్ని కల్పించేలా బడ్జెట్ లో పొందు పర్చారు సీఎం బస్వరాజ్ బొమ్మై(CM Bommai Budget).
కర్ణాటకలో ఈ ఏడాదిలో ఏప్రిల్ – మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంవత్సరంలో రైతులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసింది బీజేపీ హై కమామాండ్. రైతులకు ఇచ్చే వడ్డీ లేని స్వల్ప కాలిక రుణ పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం. శుక్రవారం బస్వరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడారు.
సీఎం పదవితో పాటు కీలకమైన ఆర్థిక శాఖను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర శాసనసభలో 2023-24 బడ్జెట్ ను సమర్పించారు. ఈ ఏడాది 30 లక్షల మంది రైతులకు రూ. 25, 000 కోట్ల రుణాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించారు. కిసాన్ గుర్తింపు కార్డుదారులకు కొత్త పథకం భూ సిరి కింద రూ. 10 వేలు సబ్సిడీ ఇవ్వాలని తమ సర్కార్ నిర్ణయించిందని చెప్పారు సీఎం(CM Bommai Budget).
Also Read : తేజస్వి కంటే నా కొడుక్కి ఏం తక్కువ