CM SS Sukhu : లాబీయింగ్ అబద్దం ప్రజా పాలనే ముఖ్యం
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు
CM SS Sukhu : ఊహించని రీతిలో దైవభూమిగా పేరొందిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పవర్ లోకి వచ్చింది. పీసీసీ చీఫ్ గా ఉన్న బస్ కండక్టర్ కొడుకైన సుఖ్విందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
లాబీయింగ్ చేయడం వల్లే వచ్చిందంటూ భారతీయ జనతా పార్టీ చేసిన కామెంట్స్ ను కొట్టి పారేశారు సీఎం. ప్రజా పాలనే ముఖ్యమన్నారు. తమ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని అన్నారు. వాటిపై ఫోకస్ పెడతామని చెప్పారు. తమ పార్టీలో ఫ్యాక్షనిజం లేదని కుండ బద్దలు కొట్టారు.
తాను అత్యంత సామాన్యమైన కుటుంబం వచ్చానని చెప్పారు సుఖ్విందర్ సింగ్ సుఖు(CM SS Sukhu). ప్రబుత్వ ఏర్పాటుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు సీఎం. ఇదే సమయంలో రాజీవ్ శుక్లా కీలకంగా మారనున్నారన్న కామెంట్స్ పై స్పందించారు. అలాంటిది ఏమీ లేదన్నారు.
ఎవరైనా సరే పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు సుఖ్విందర్ సింగ్ సుఖు. గతంలో ఆరుసార్లు సీఎం గా ఉన్న వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ చివరి దాకా సీఎం రేసులో ఉన్నారు. ఇదిలా ఉండగా ఆమె తనయుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆయనకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా తన తల్లి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రియాంక గాంధీ కీలకంగా మారారు. ఆమె ఆధ్వర్యంలో పార్టీ పవర్ లోకి వచ్చింది.
Also Read : ఒకప్పుడు జర్నలిస్ట్ నేడు డిప్యూటీ సీఎం